25, ఆగస్టు 2010, బుధవారం

తెలుగు బాట

10, జూన్ 2010, గురువారం

జూన్ 2010, e-తెలుగు/బ్లాగర్ల సమావేశం

సమయం : ఆదివారం, జూన్ 13, 2010 సాయంత్రం 4:30 గంటలకు
వేదిక : కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

e-తెలుగు కార్యక్రమాల గురించి తెలుసు కోవడానికి, బ్లాగుల్లో ఏదైనా సందేహాలున్నా, ఇతర బ్లాగర్లతో సంభాషించాలన్నా ఈ సమావేశానికి హాజరు కావచ్చు.

4, మే 2010, మంగళవారం

2010 మే నెల తెలుగు బ్లాగర్ల /e-తెలుగు సమావేశం

14, ఏప్రిల్ 2010, బుధవారం

టపాలకు అలంకరణలు

చాలా మంది బ్లాగర్లు లేఖిని లోనో బరహా లోనో టపాలను టైప్ చేసేసి దాన్ని తీసుకువచ్చి ఇక్కడ అతికించేసి ప్రచురించేసి చేతులు దులిపేసుకుంటారు.
అయితే ఈ క్రింది చూపిన పటం చూడండి. రౌండప్ చేసిన భాగంలో పాఠ్యాంశాన్ని ఆకర్షణీయంగా చేయడానికి ఎన్నో సౌకర్యాలున్నాయి. ఉదాహరణకు T లాగా కనిపిస్తున్న ఐకాన్ మీద నొక్కితే పాఠ్యం పరిమాణం పెంచవచ్చు. దాని తరువాత కనిపించే రెండు ఐకాన్లనుపయోగించి బొద్దు అక్షరాలు, వాలు అక్షరాలు గా మార్చవచ్చు. అలాగే అక్షరాలకు రంగులద్దవచ్చు. టపాలోని పదాలకు లంకెలివ్వచ్చు (నేను లేఖిని, బరహాకు ఇచ్చినట్లుగా)
పాఠ్యం పుటలో కుడి వైపున ఉండాలా, ఎడమ వైపున ఉండాలా, మధ్యలో ఉండాలో ఎంచుకోవచ్చు. పాయింట్ల రూపంలో రాయవచ్చు. ఇలా ఎన్నెన్నో చేయవచ్చు. కాబట్టి ఈ సారి నుంచి టపాలు రాసేటప్పుడు ఇవన్నీ ఉన్నాయని మరిచిపోకండి సుమా...

27, జనవరి 2010, బుధవారం

ఇన్‌స్క్రిప్ట్ చిట్కాలు

కొన్ని పదాలు వాటిని ఇన్‌స్క్రిప్ట్ లో టైపు చేసే విధానం
కలము - k(క)n(ల)cg(ము)
బ్లాగు - ydne(బ్లా) ig(గు) (వత్తులు రావాలంటే అక్షరాల మధ్యలో d నొక్కాలి)
విజ్ఞానం - bf(వి)(%e)జ్ఞా (v)న (x)ం
అక్షరం - D(అ) &(క్ష) j(ర) x(ం)
ఆశ్రయం - E(ఆ) *(శ్ర) /x(యం)
సాఫ్ట్‌వేర్ - me(సా)Hd'd(ప్ట్) <ctrl+shift+2> bs(వే)jd(ర్) - మధ్యలో <ctrl+shift+2> కొట్టకపోతే ఇదే పదం సాఫ్ట్వేర్ అని కనిపిస్తుంది.
ఈర్ష్యాళువు - R(ఈ) jd<d/e(ర్ష్యా) Ng(ళు) bg(వు)
హృదయం - u=(హృ) o(ద) /x(యం)

11, జనవరి 2010, సోమవారం

గూగుల్ రీడర్ పరిచయం



యూఆర్ఎల్: http://www.google.co.in/reader/

గూగుల్ రీడర్ అనేది వెబ్‌సైట్లను/బ్లాగుల్లో ప్రచురించే సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక ఆన్ లైన్ ఉపకరణం. కావలసిందల్లా ఆ వెబ్ సైటులో కొత్త సమాచారాన్ని చేర్చినప్పుడల్లా అది ఫీడ్ ను(ఉదా. RSS లేదా Atom ఫీడు) ఉత్పత్తి చేయగలిగి ఉంటే చాలు. ప్రస్తుతం మన బ్లాగులన్నీ ఇలాంటి ఫీడ్లను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి సమస్య లేదు. ఉదాహరణకు టెక్ చిట్కా బ్లాగును నేను అనురించాలనుకుంటున్నాననుకోండి. ఈ క్రింది విధంగా చెయ్యండి.
ముందుగా పైన సూచించిన URL కి వెళ్ళండి. రీడర్ లోకి ప్రవేశించడానికి మీ గూగుల్ ఖాతా అవసరమౌతుంది.
Add a subscription మీద క్లిక్ చెయ్యండి. పాఠ్యపు పెట్టెలో (టెక్స్ట్ బాక్స్) URL ఎంటర్ చేసి Add అనే బటన్ మీద నొక్కండి. అంతే..


మీరు చదవాలనుకున్న బ్లాగులను అనుసరిస్తే (Subscribe చేసుకుంటే) సదరు బ్లాగుల్లో కొత్త టపా పడినప్పుడల్లా మీకు తెలియబరచబడుతుంది.



ఒక వేళ మీరు ఆ బ్లాగును అనుసరించడం మానేయలనుకుంటే క్రిందివిధంగా చెయ్యండి.

16, డిసెంబర్ 2009, బుధవారం

‌ఫేస్‌బుక్ (Facebook) తెలుగులో రావాలంటే...



మీరు ఫేస్‌బుక్ లోకి ప్రవేశించిన తర్వాత Settings లోకి వెళ్ళి Language జారుడు జాబితా నుంచి తెలుగును ఎంచుకోండి.
అంతే మీ ఫేస్‌బుక్ పుట తెలుగులో దర్శనమిస్తుంది.